Corona alert: ఆ నాలుగు జోన్ల‌లోనే క‌రోనా ఎక్కువః కేసీఆర్‌

కంటైన్‌మెంట్ జోన్ల‌లో లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Corona alert: ఆ నాలుగు జోన్ల‌లోనే క‌రోనా ఎక్కువః కేసీఆర్‌

Updated on: May 16, 2020 | 11:38 AM

తెలంగాణ‌లో ఎక్కువ యాక్టివ్ కేసులు లేవ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లోని నాలుగు జోన్ల‌లో మాత్రం కోవిడ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయ‌ని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్‌, కార్వాన్‌ల‌లోనే  వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఈ నాలుగు జోన్లలో 1,442 కుటుంబాలు కంటైన్మెంట్‌ పరిధిలో ఉన్నాయని వివరించారు. ఇక కంటైన్‌మెంట్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అటు హైద‌రాబాద్‌లో బ‌స్తీ ద‌వాఖానాల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని చెప్పారు మ‌రో 45 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభించాల‌ని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలోని యాదాద్రి భువ‌న‌గిరి, జ‌న‌గామ‌, మంచిర్యాల జిల్లాల్లోకి కొద్ది రోజుల క్రితం వ‌చ్చిన‌ వ‌ల‌స కార్మికుల‌కు వైర‌స్ సోకిన‌ట్లు  గుర్తించ‌గా, వారంతా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే చికిత్స పొందుతున్నార‌ని
సీఎం తెలిపారు. ప్ర‌స్తుతం ఆయా జిల్లాల్లో క‌రోనా యాక్టివ్ కేసులేమీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలనే యథాతథంగా అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.