దేశంలో ఓ వైపు కరోనా పంజా విసురుతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కారణంగా వైరస్ మరింత వేగంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా పెళ్లిళ్లు, పండగలు, ఉత్సవాలు, వేడుకలు అన్ని సాదాసీదాగా జరుపుకుంటున్న క్రమంలో కొంతమంది నిబంధనలు పక్కకు నెట్టేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలకు కుటుంబాలు వైరస్ బారిన పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అటువంటి ఘటనే చోటు చేసుకుంది.
రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని భద్వాసియా ప్రాంతంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన 27 మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. వివాహ వేడుకకు హాజరైన వారంతా కరోనా పాజిటివ్‌గా ఉన్నారని డిప్యూటీ సిఎంహెచ్‌వో డాక్టర్ ప్రీతమ్ సింగ్ తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు..పెళ్లిలో పాల్గొన్న ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఆ విషయం ఆమె అక్కడున్న ఎవరికీ చెప్పలేదు. దీంతో పెళ్లి కొడుకు మినహా …వివాహ వేడుకలో పాల్గొన్న 27 మందికి కూడా కరోనా సోకినట్లు తెలింది.