పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

| Edited By:

Jun 12, 2020 | 11:46 AM

ప్రస్తుతం కరోనా వైరస్ నేపధ్యంలో పెన్షన్ డబ్బులను విత్‌ డ్రా చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్‌వో. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు...

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో
Follow us on

ప్రస్తుతం కరోనా వైరస్ నేపధ్యంలో పెన్షన్ డబ్బులను విత్‌ డ్రా చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈపీఎఫ్‌వో. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈపీఎఫ్‌వో (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) మరో వెలుసుబాటును కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కామన్ సర్వీస్ సెంటర్‌ల ద్వారా అయినా వీటిని అందజేయవచ్చని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం పింఛనుదారుల కోసం ఈ డెసిషన్ తీసుకున్నట్లు వివరించింది. పింఛనుదారులు ఏటా డిసెంబర్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తున్నాయి.

కాగా ఈఫీఎఫ్‌వో ఈ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్‌సీల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతాయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది. పెన్షన్ దారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సీఎస్‌సీల్లో ఇవ్వచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.

Read More:

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..