బ్రేకింగ్ : ఢిల్లీలో భూ ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం 7 గంటంల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.6 గా నమోదైంది. వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది...

బ్రేకింగ్ : ఢిల్లీలో భూ ప్రకంపనలు

Updated on: Jul 03, 2020 | 7:49 PM

Earthquake at Delhi : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం 7 గంటంల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5 గా నమోదైంది. వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. మూడు నుంచి నాలుగు సెకెన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. గురుగ్రామ్‌కు నైరుతి దిశగా 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. అయితే గతంలో వచ్చిన ప్రకంపనల కంటే అధికంగా వచ్చిందని ఢిల్లీ వాసలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు దేశం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. ఈ భూ ప్రకంపనల వార్త హడలెత్తించింది.