Early stages of Covid-19 third wave: థర్డ్‌వేవ్ ఎంతో దూరం లేదు .. కరోనా మూడో దశ ప్రారంభంలో ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. లేదంటే పెనుముప్పు తప్పదని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్యసంస్థ. డెల్టా వేరియంట్ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ వేవ్ తొలి దశలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ హెచ్చరించారు. దురదృష్టవశాత్తు మనం కరోనా థర్డ్‌వేవ్ ఆరంభ దశలో ఉన్నామన్నారు. కరోనా వైరస్ నిరంతరం మారుతోందని, మరింత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైరస్ 111 దేశాల్లో నమోదు అయ్యింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ హెచ్చరించారు. కరోనా తగ్గిందన్న అపోహ చాలా దేశాల్లో కన్పిస్తోందని డబ్లుహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ఎక్కడికి పోలేదని రూపం మార్చుకుంటోందని తెలిపింది. ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం , భౌతికదూరం పాటించకపోవడంతో కరోనా వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
చాలామంది గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని దీంతో వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని వెల్లడించింది. యూరప్ దేశాలతో పాటు అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికి డెల్టా వేరియంట్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని డబ్లుహెచ్‌వో తెలిపింది. గత నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి.
10 వారాలు తగ్గినట్టు తగ్గి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,806 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.
The International Health Regulations Emergency Committee on #COVID19 reconvenes today, for the 8th time since its first meeting in January 2020.
More about the IHR Emergency Committee: https://t.co/Qtsxqkr7xi pic.twitter.com/S05Ua7032b
— World Health Organization (WHO) (@WHO) July 14, 2021
Read Also…. PM Fasal bima: ఫసల్ బీమా పథకంలో మార్పులు.. తెలుసుకోండి.. ప్రయోజనం పొందండి