కరోనా వైరస్ పై నిర్లక్ష్యం తగదు, ప్రధాని మోదీ హెచ్ఛరిక

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 1:22 PM

కరోనా వైరస్ పై నిర్లక్ష్యం తగదని ప్రధాని మోదీ ప్రజలను హెచ్ఛరించారు. ఈ వైరస్ కు తగిన మందును గానీ, వ్యాక్సీన్  ను గానీ కనుగొనేంతవరకు ముఖాలకు మాస్కుల ధారణ, రెండుగజాల భౌతిక దూరం..

కరోనా వైరస్ పై నిర్లక్ష్యం తగదు, ప్రధాని మోదీ హెచ్ఛరిక
Follow us on

కరోనా వైరస్ పై నిర్లక్ష్యం తగదని ప్రధాని మోదీ ప్రజలను హెచ్ఛరించారు. ఈ వైరస్ కు తగిన మందును గానీ, వ్యాక్సీన్  ను గానీ కనుగొనేంతవరకు ముఖాలకు మాస్కుల ధారణ, రెండుగజాల భౌతిక దూరం పాటింపు అతి ముఖ్యమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యప్రదేశ్ లో నిర్మించిన 1.75 లక్షల గృహ సముదాయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. లోగడ కూడా తాను ఇదే హెచ్ఛరికలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తామంటూ ప్రజల చేత ఆయన నినాదాలు కూడా చేయించారు. గత కొన్ని రోజులుగా ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 46.5 లక్షల కేసులు నమోదు కాగా-77 వేల మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ కేసుల్లో బ్రెజిల్ ని ఇండియా దాటేసింది.