Vaccination: క‌రోనా వ్యాక్సిన్ పురుషుల్లో సంతానోత్ప‌త్తిని దెబ్బ తీస్తుందా.? శాస్త్ర‌వేత్త‌లు ఏం చెబుతున్నారంటే..

|

Jun 19, 2021 | 6:11 AM

Covid Vaccination: క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి మ‌న‌ద‌గ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌దేశాలు ఈ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నాయి. భార‌త్‌లోనూ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది...

Vaccination: క‌రోనా వ్యాక్సిన్ పురుషుల్లో సంతానోత్ప‌త్తిని దెబ్బ తీస్తుందా.? శాస్త్ర‌వేత్త‌లు ఏం చెబుతున్నారంటే..
Covid Vaccine Effect
Follow us on

Covid Vaccination: క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి మ‌న‌ద‌గ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌దేశాలు ఈ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నాయి. భార‌త్‌లోనూ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. అయితే తొలుత వ్యాక్సిన్ వేసుకోవడానికి జ‌నాలు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. వ్యాక్సినేష‌న్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయ‌ని పుకార్లు షికార్లు చేయ‌డమే దీనికి ప్రధాన కార‌ణం. అయితే సెల‌బ్రిటీలు సైతం టీకాలు తీసుకుంటూ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో వ్యాక్సిన్‌పై న‌మ్మ‌కం పెరిగింది.
ఇదిలా ఉంటే గ‌త కొన్ని రోజులుగా వ్యాక్సిన్‌పై మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుల్లో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌ని వార్త‌లు షికార్లు చేశాయి. అయితే దీనిపై తాజాగా అమెరికా శాస్త్ర‌వేత్త‌లు స్పందించారు. వ్యాక్సిన్లు.. సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి దుష్ర్పభావమూ చూపవని అమెరికాలోని మియామీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు వేసుకోకముందు, వేసుకొన్న తర్వాత రెండు సందర్భాల్లోనూ వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించలేదని, శుక్రకణాలు తగ్గలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం శాస్త్ర‌వేత్త‌లు 45 మందికి మొదట పరీక్షలు నిర్వహించగా.. వారిలో 21 మంది ఫైజర్‌, 24 మందికి మోడెర్నా టీకా వేశారు. ఫైజర్‌ వేసుకొన్న బృందంలో వ్యాక్సిన్‌ వేసుకోకముందు వారిలో సగటున మిల్లీలీటర్‌ వీర్యంలో 2.6 కోట్ల శుక్రకణాలుండగా, టీకా వేసుకొన్న తర్వాత అవి 3 కోట్లకు పెరిగాయి. మోడెర్నా వేసుకొన్నవారిలో 3.6 కోట్ల నుంచి 4.4 కోట్లకు పెరిగాయి. కాబ‌ట్టి వ్యాక్సిన్ వ‌ల్ల సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌న్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌న్న‌మాట‌.

Also Read: Young Lady Given Two Shots Jab: కొంచముంచిన నర్సు ఫోన్ కాల్.. హైదరాబాద్ శివారులో నిమిషాల వ్యవధిలో డబల్ డోస్ వ్యాక్సిన్

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పురుషులలో పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతుందనేది అపోహ.. తేల్చిచెప్పిన అధ్యయనాలు!

Covid-19 Vaccination Scam: నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేసులో.. నలుగురు నిందితుల అరెస్ట్..