
కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. చిన్నా.. పెద్ద, ధనిక.. పేద, అన్న తేడా లేకుండా అందర్నీ టచ్ చేస్తోంది. తాజాగా ఈ మహమ్మారి రాజకీయ నేతలను, పోలీసులకు, జర్నలిస్టులను.. చివరకు వైద్యులను కూడా వదలడం లేదు. తాజాగా తమిళనాడులో డీఎంకే సీనియర్ నేత కూడా కరోనాతో పోరాడుతున్నారు. చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఆయన సహాయ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఆయన కరోనా సోకి చెన్నైలోని క్రోమ్‌పేటలో ఉన్న డాక్టర్ రీలా ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు తెల్పిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. ఆయన తనకు అవసరమైన ఆక్సిజన్‌లో 80 శాతం వెంటిలేటర్ ద్వారానే తీసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి
మార్పు లేదని.. వెంటిలేటర్ మీది నుంచే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.