
కరోనా మహమ్మారి తమిళనాడుకు చెందిన ఓ ఎమ్మెల్యేను బలితీసుకుంది. వైరస్ బారినపడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందారు. కరోనా సోకడంతో గతవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం తీవ్ర విషాదకరం.
గత వారం కోవిడ్-19 లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన అన్బళగన్‌కు పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల క్రితం వరకు కోలుకున్నట్లే కనిపించారు. అయితే శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఆయనకు రక్తపోటు, గుండె పనితీరు కూడా క్షీణించటంతో ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉందన్నారు. అప్పటి నుంచి ఆయన 80 శాతం వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఎమ్మెల్యే అన్బళగన్ మృతితో డీఎంకే శ్రేణులు శోకసంద్రంలో ముగినిపోయాయి. అన్బళగన్మూడు మూడు సార్లు డీఎంకే పార్టీ తరపున ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఎమ్మెల్యే అన్బళగన్.. డిస్టిబ్యూటర్, ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించారు. తమిళంలో నటుడు జయం రవితో ‘ఆదిభగవాన్’చిత్రాన్ని
నిర్మించారు. ఒక శాసనసభ్యుడు కరోనా సోకి మరణించడం దేశంలోనే ఇదే మొదటిది. అన్బళగన్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తోపాటు పలువురు పామ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
Tamil Nadu: DMK MLA J Anbazhagan who was suffering from COVID19 passes away at a private hospital in Chennai pic.twitter.com/g0LQMNw0v3
— ANI (@ANI) June 10, 2020