
ఇటీవల ఆమోదించిన కోవిడ్-19 మందు..’ఫెవిపిరవిర్..ఫ్యాబీ ఫ్లూ మెడిసిన్ కి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తోందన్న ఆరోపణపై దీని తయారీ సంస్థ ‘గ్లెన్ మార్క్’ కి కేంద్ర డ్రగ్ కంట్రోల్ ప్రామాణిక సంస్థ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పైగా దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉందని దుయ్యబట్టింది. ఒక ఎంపీ ఇఛ్చిన ఫిర్యాదుపై తాము ఈ నోటీసు జారీ చేస్తున్నామని, దీని రేటు సుమారు రూ. 12,500 లని పేర్కొంది. ఇంత ఖరీదు పెట్టి పేదలు, మధ్యతరగతి వర్గాలు ఈ మెడిసిన్ ని కొనగలుగుతారా అని ఈ సంస్థ ప్రశ్నించింది. పైగా ఫ్యాబీ ఫ్లూ బీపీకి, డయాబెటిస్ కి కూడా మంచి మందు అన్న ప్రచారాన్ని తాము విశ్వసించడం లేదని డ్రగ్ కంట్రోల్ ప్రామాణిక సంస్థ స్పష్టం చేస్తూ తాము జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వెంటనే సమాధానం ఇవ్వాలని కోరింది.
ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి లక్షలమంది మరణిస్తున్నారు. ఈ మందు ఒక్కో టాబ్లెట్ ఖరీదు 103 రూపాయలుగా ఉంది.