‘మాకు రూ. 5 వేల కోట్లు ఇవ్వండి’.. కేంద్రానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థన

తమ ప్రభుత్వం తీవ్ర కష్టాల్లో ఉందని, ఉద్యోగులకు చెల్లించేందుకు  తమకు రూ. 5 వేల కోట్లు సాయం చేయాలని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ విపత్కర సమయంలో..

మాకు రూ. 5 వేల కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థన

Edited By:

Updated on: May 31, 2020 | 4:35 PM

తమ ప్రభుత్వం తీవ్ర కష్టాల్లో ఉందని, ఉద్యోగులకు చెల్లించేందుకు  తమకు రూ. 5 వేల కోట్లు సాయం చేయాలని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ విపత్కర సమయంలో ఈ సహాయం చేసి ఢిల్లీ ప్రజలను ఆదుకొండి అని ట్వీట్ చేశారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి తమకు ఒక్క రూపాయి  కూడా రాలేదని, ఇతర రాష్ట్రాలకు మాత్రం ఈ సాయం అందుతోందని ఆర్ధిక శాఖను కూడా పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా సైతం పేర్కొన్నారు. సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు, ఇతర అవసరాలకు నెలకు ఢిల్లీ సర్కార్ కి మూడున్నర వేల  కోట్లు అవసరమవుతాయన్నారు.  గత రెండు నెలలుగా తమ జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ. 500 కోట్లేనని  శిశోడియా పేర్కొన్నారు. మాకు కనీసం ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం. ముఖ్యంగా ఈ కరోనా టైం లో మా ఉద్యోగులంతా అహర్నిశలూ  చాలా కష్టపడుతున్నారు అని ఆయన వివరించారు. అసలు తమకు ఆదాయం లేదని అరవింద్ కేజ్రీవాల్ గతంలోనే ఉసూరుమన్నారు. లాక్ డౌన్-4 విధించడానికి ముందే అప్పటివరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి కూడా  ఆయన రెడీ అయ్యారు.