
కరోనా మహమ్మారి దేశ రాజధానిలో విజృంభిస్తోంది. ఇప్పటికే 50 వేల మార్క్‌ను దాటి.. 60 వేలకు చేరువైంది. తాజాగా ఆదివారం నాడు.. కొత్తగా మరో 3వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,746కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 63 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 2,175కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33,013కి చేరింది.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4లక్షలకు చేరింది. వీటిలో ప్రస్తుతం 1.69లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2.27 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి 13వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.