ఢిల్లీలో కొత్తగా మరో 1,076 పాజిటివ్‌ కేసులు

| Edited By:

Aug 06, 2020 | 1:16 AM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్న మరుసటి రోజే.. అకస్మాత్తుగా మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో..

ఢిల్లీలో కొత్తగా మరో 1,076 పాజిటివ్‌ కేసులు
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్న మరుసటి రోజే.. అకస్మాత్తుగా మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య
1,40,232కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,26,116 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,072 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,044 మంది మరణించారు.

ఇదిలావుంటే.. బుధవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 16 వేల కరోనా పరీక్షలు నిర్వహించారు. 4870 ఆర్టీపీసీఆర్‌ విధానంలో పరీక్షలు చేయగా.. 11,915 టెస్టులు ర్యాపిడ్‌  యాంటిజెన్‌ విధానంలో చేశారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 10,99,882 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు