Delhi CM Arvind Kejriwal: ఢిల్లీలో కోటి దాటిన కరోనా టెస్టులు… ట్వీట్ చేసిన సీఎం…

| Edited By:

Jan 21, 2021 | 11:06 AM

‘ఇప్పటివరకు కోటి మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇది ఢిల్లీ జనాభాలో 50 శాతానికి సమానం. కరోనా టెస్టులు పెంచడం, మెరుగైన...

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీలో కోటి దాటిన కరోనా టెస్టులు... ట్వీట్ చేసిన సీఎం...
Follow us on

‘ఇప్పటివరకు కోటి మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇది ఢిల్లీ జనాభాలో 50 శాతానికి సమానం. కరోనా టెస్టులు పెంచడం, మెరుగైన చికిత్సను అందించడంతో ఢిల్లీలో మహమ్మారి వ్యాప్తిని నిలువరించగలిగాం’ అని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలో కరోనా పరీక్షలు కోటి దాటాయి. బుధవారం నాటికి కోటికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇదో సరికొత్త రికార్డని కేజ్రీవాల్ తెలిపారు.

 

ఢిల్లీలో నిన్నటివరకు 6,33,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 228 మంది కరోనా బారినపడగా, మరో 10 మంది మరణించారు. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వం పరీక్షల సంఖ్యను భారీగా పెంచింది. దీంతో నిన్నసాయంత్రం వరకు 1,00,59,193 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో బుధవారం ఒక్కరోజే 63,151 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ రేటు 0.36 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.