
ప్రస్తుత విద్యార్థులకు ఆగస్టు నుంచి, నూతన విద్యార్థులకు సెప్టెంబరు నుంచి కాలేజీలు ప్రారంభమవుతాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. కరోనా కారణంగా గత మార్చి నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే యూజీసీ ప్రకటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.