Delhi CM : కరోనా టీకా పంపిణీలో కేజ్రీవాల్ సర్కారు వినూత్న ప్రయోగం.. వేగాస్ మాల్‌లో ‘డ్రైవ్ త్రూ కొవిడ్ వ్యాక్సిన్’కి శ్రీకారం

Drive-through COVID-19 vaccination : రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు వినూత్న రీతిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టింది...

Delhi CM : కరోనా టీకా పంపిణీలో కేజ్రీవాల్ సర్కారు వినూత్న ప్రయోగం.. వేగాస్ మాల్‌లో డ్రైవ్ త్రూ కొవిడ్ వ్యాక్సిన్కి శ్రీకారం
Covid 19 Vaccination Drive

Updated on: May 26, 2021 | 3:27 PM

Drive-through COVID-19 vaccination : రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు వినూత్న రీతిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టింది. కారులో వెళ్తూ వెళ్తూనే కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్లిపోయే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోనే మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సరికొత్త వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 12 లోని వేగస్ మాల్‌లో ఈ ‘డ్రైవ్-త్రూ కొవిడ్ – 19 టీకా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భాగస్వామ్యంతో ఈ టీకా పంపిణీ కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు నుండి ద్వారకాలో ‘డ్రైవ్ త్రూ టీకా’ కేంద్రం టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇలాంటి మరెన్నో కేంద్రాలు త్వరలోనే ఢిల్లీ వ్యాప్తంగా ప్రారంభమవుతాయని చెప్పారు. ఢిల్లీ వాసులకు కావల్సినంత టీకా సరఫరా కోసం వేచి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం త్వరలో మరిన్ని టీకాలను అందిస్తుందని, తద్వారా ఇలాంటి మరిన్ని కేంద్రాలను తెరవగలమని ఆశిస్తున్నామని సీఎం తెలిపారు.

Drive Through Covid 19 Vacc

Read also : TS Cabinet : 30న టీఎస్ క్యాబినెట్ భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం