బ్రేకింగ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపే కరోనా పరీక్షలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. కేజ్రీవాల్‌కు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. జ్వరం, దగ్గు, గొంతునొప్పితో ఆయన బాధపడుతున్నారని....

బ్రేకింగ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపే కరోనా పరీక్షలు

Edited By:

Updated on: Jun 08, 2020 | 1:10 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. కేజ్రీవాల్‌కు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. జ్వరం, దగ్గు, గొంతునొప్పితో ఆయన బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. మంగళవారం సీఎం కేజ్రీవాల్‌తో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు వైద్యులు. అలాగే కేజ్రీవాల్‌తో గత రెండు, మూడు రోజుల నుంచి ఎవరెవరు భేటీ అయ్యారో కూడా వారి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఢిల్లీ సీఎంవో.

Read More:

మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్.. తక్షణమే రూ.10 లక్షల రుణం..

విషాదం.. కరోనా వైరస్‌తో జర్నలిస్ట్ మృతి

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య