Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు..టీకా బూస్టర్ డోస్‌‌పై భారత్ కీలాక నిర్ణయం అప్పుడే!

|

Nov 30, 2021 | 6:01 PM

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి భయం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోనూ అడుగుపెడుతుందేమో అనే. ఈ నేపధ్యంలో క్రిటికల్ పేషెంట్లు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తుల కోసం టీకా అదనపు మోతాదులపై ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది.

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు..టీకా బూస్టర్ డోస్‌‌పై భారత్ కీలాక నిర్ణయం అప్పుడే!
Coronavirus Booster Dose
Follow us on

Omicron Variant: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి భయం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోనూ అడుగుపెడుతుందేమో అనే. ఈ నేపధ్యంలో క్రిటికల్ పేషెంట్లు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తుల కోసం టీకా అదనపు మోతాదులపై ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోందని దేశ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTG) ఈ విధానాన్ని 2 వారాల్లో సిద్ధం చేస్తుంది. దేశంలోని 44 కోట్ల మంది పిల్లలకు వ్యాక్సినేషన్‌ కోసం ఎన్‌టీఏజీ కొత్త విధానాన్ని కూడా తీసుకురానుంది.
అరోరా మాట్లాడుతూ- దేశంలోని అనేక ల్యాబ్‌లు ప్రస్తుతం కొత్త వేరియంట్‌పై భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నాయి. దీనికి 2 వారాలు పట్టవచ్చు. కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇతర వ్యాక్సిన్‌లు కొత్త వైరస్‌తో ఏ మేరకు పోరాడగలవో అప్పుడే మనకు తెలుస్తుంది.

అనేక దేశాల్లో వృద్ధులకు బూస్టర్ మోతాదు

యుఎస్, యుకె, ఇజ్రాయెల్ వంటి దేశాలలో, హై రిస్క్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు ఇప్పటికే బూస్టర్ డోస్‌లు ఇస్తున్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ అరోరా ఇలా అన్నారు. ”కరోనా కొత్త వేరియంట్ తెరపైకి వచ్చిన తర్వాత, చాలా దేశాలలో వృద్ధులకు బూస్టర్ డోస్‌లు ఇస్తున్నారు. వీటిలో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ ఉన్నాయి. బూస్టర్ అంటే మనకు ఇంకా 94 కోట్ల డోసులు కావాలి. వీటిని ఒక్క రాత్రిలో తయారు చేయడం సాధ్యం కాదు. అయితే, దేశంలో వ్యాక్సిన్‌ కొరత లేదు.”

ఇంకా టీకా విషయమై ఆరోరా దేశంలో 12 నుండి 15 కోట్ల మంది ప్రజలు ఒక్క డోస్ టీకా తీసుకోలేదని చెప్పారు. 30 కోట్ల మందికి రెండో డోస్ అందలేదు. టీకాను వేగవంతం చేయాలని స్పష్టంగా ప్రయత్నిస్తున్నాం. అయితే, ఇది ప్రాధాన్యత ప్రాతిపదికన జరగాలని ఆయన అంటున్నారు.

దేశంలో ఓమిక్రాన్ కేసు లేదు

ఇప్పటివరకు భారతదేశంలో ఒక్క ఓమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ నెల ప్రారంభంలో బెంగళూరుకు వచ్చిన ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరికి డెల్టా స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పరీక్ష నమూనాలను ల్యాబ్‌లకు పంపామని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపారు. మేము ఒమిక్రాన్(Omicron) జాతిపై చాలా జాగ్రత్తగా ఉన్నాము.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో ఎపిడెమియాలజీ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా భారతదేశంలో ఇప్పటికే ఓమిక్రాన్ ఉండే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షల ద్వారానే ఈ వేరియంట్‌కు సంబంధించిన సమాచారం వెల్లడవుతుందని పాండా తెలిపారు.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..