ముంబై..’నిసర్గ’ తుపాను భయం.. 150 మంది కరోనా రోగుల తరలింపునకు ‘మహా’ నిర్ణయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 02, 2020 | 1:07 PM

నిసర్గ తుపాను భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లుతోంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో  రోగుల రక్షణ, భద్రత మీద సర్కార్ దృష్టి పెట్టింది. ఈ  నేపథ్యంలో.. 150 మంది కరోనా రోగులను..

ముంబై..నిసర్గ తుపాను భయం.. 150 మంది కరోనా రోగుల తరలింపునకు మహా నిర్ణయం
Follow us on

నిసర్గ తుపాను భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లుతోంది. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో  రోగుల రక్షణ, భద్రత మీద సర్కార్ దృష్టి పెట్టింది. ఈ  నేపథ్యంలో.. 150 మంది కరోనా రోగులను వారి ఆసుపత్రుల నుంచి ఓర్లీ లోని కోవిడ్ కేంద్రానికి తరలించాలని నిర్ణయించింది. నిసర్గ తుపాను కారణంగా గంటకు 125 కి.మీ. వేగంతో పెనుగాలులు వీయవచ్ఛునని భారత వాతావరణ శాఖ హెచ్ఛరించినందున.. ప్రభుత్వం ఇందుకు సమాయత్తమైంది. భారీ వర్షం ముంచెత్తకుండా ఓర్లీలోని కోవిడ్ కేంద్రం వద్ద భారీ పిల్లర్లను, ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో వైట్ టెంట్లను కూడా నిర్మిస్తున్నారు. గంటకు వంద కి.మీ. వేగంతో వీచే గాలులను ఈ టెంట్లు తట్టుకోగలవని, అయితే అంతకు మించితే మాత్రం కొంత ముప్పు ఉండవచ్చునని ఇంజనీర్లు అంటున్నారు.