విషాదం.. కేంద్ర బలగాల్లో కరోనా మరణం నమోదు..

కరోనా మహమ్మారి కాటుకు కేంద్ర బలగాల్లో తొలి మరణం సంభవించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన 55 ఏళ్ల ఓ అధికారి.. మంగళవారం ప్రాణాలు విడిచారు. ఏఎస్ఐ ర్యాంకు అధికారి హోదాలో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టులు రావడంతో.. వెంటనే ఆయన్ను సఫ్దర్‌ గంజ్‌ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంతో […]

విషాదం.. కేంద్ర బలగాల్లో కరోనా మరణం నమోదు..

Edited By:

Updated on: Apr 28, 2020 | 9:26 PM

కరోనా మహమ్మారి కాటుకు కేంద్ర బలగాల్లో తొలి మరణం సంభవించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన 55 ఏళ్ల ఓ అధికారి.. మంగళవారం ప్రాణాలు విడిచారు. ఏఎస్ఐ ర్యాంకు అధికారి హోదాలో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టులు రావడంతో.. వెంటనే ఆయన్ను సఫ్దర్‌ గంజ్‌ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంతో పటిష్టంగా ఉన్న సీఆర్‌పీఎఫ్ దళాల్లో తొలిమరణం సంభవించడం కలకలం రేపుతోంది.

కాగా.. తాజాగా ఢిల్లీలో మంగళవారం 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వీరందర్నీ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 47 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ముప్పై వేలకు సమీపిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు. మరణాలు కూడా దాదాపు వెయ్యికి చేరువులో ఉండటం భయబ్రాంతులకు గురిచేస్తోంది.