Covin App: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ఐతే టీకా వేసుకోవాలంటే కోవిన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే వ్యాక్సినేషన్‌లో ఎంతో కీలమైన కోవిన్ పోర్టల్‌ను కేంద్రం ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు మరింత ఈజీ కానున్నాయి. కోవిన్ పోర్టల్‌లో కొత్తగా తెలుగు,హిందీతో పాటు మొత్తం పది ప్రాంతీయ భాషలను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో తెలుగు సహా మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, ఇంగీష్ భాషలు ఉన్నాయి.
ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఇప్పటివరకు కోవిన్ పోర్టల్ కేవలం ఇంగ్లీష్ భాషలో ఉండడంతో.. ఆ భాష రాక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యమంత్రిత్వ శాఖ కోవిన్ పోర్టల్‌లో ఈ కీలక మార్పులు చేసింది. గత నెల 17న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత మంత్రుల బృందం.. హిందీ సహా 14 భాషలను పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్యను పెంచడానికి, మరింత ప్రాదేశిక విశ్లేషణకు అనుమతించడానికి 17 కొత్త ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చబోతున్నామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 ల్యాబరేటరీల ద్వారా సేవలు అందిస్తోంది.
Also Read: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం.. కరోనాపై పోరుకు సరికొత్త డ్రగ్, చౌక ధరలో టెస్టింగ్ కిట్స్..