Covid Vaccine: వామ్మో.. ఇతను మామూలోడు కాదు.. దాని కోసం 90 సార్లు కొవిడ్ టీకా వేయించుకున్నాడు.. ఆతర్వాత ఏమైందంటే..
Corona Virus: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు చాలామంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకున్నారు.
Corona Virus: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు చాలామంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకున్నారు. మనదేశంలో పాటు మరికొన్ని దేశాల్లో హెల్త్ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు బూస్టర్ డోస్ టీకాలు కూడా పంపిణీ చేస్తు్న్నారు. ఇదిలా ఉంటే జర్మనీ (Germany) కి చెందిన ఓ వృద్ధుడు మాత్రం ఏకంగా 90 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? అడ్డదారిలో పైసలు సంపాదించడం కోసం. కొవిడ్ టీకాలు తీసుకుంటే డబ్బులెలా వస్తాయని అనుకుంటున్నారా? ఇందులోనే అసలు విషయం దాగుంది. అదేంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ సర్టిఫికెట్‌ను ఇస్తారు కదా.. వాటిని ఫోర్జరీ చేసి అవసరమైన వారికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నాడు.
పైసల కోసం..
కాగా జర్మనీలో ప్రయాణాలకు, ఇతర బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావాలంటే కొవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే వ్యాక్సిన్‌పై ఉన్న అపోహల కారణంగా చాలామంది అక్కడ టీకాలు తీసుకోవట్లేదు. దీంతో నకిలీ కొవిడ్ సర్టిఫికెట్లను కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆదాయమార్గంగా ఎంచుకున్నాడు జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరానికి చెందిన వృద్ధుడు. ఇందుకోసం వేర్వేరు చోట్ల కరోనా టీకాలు తీసుకుంటూ సర్టిఫికెట్లు తీసుకున్నాడు. అనంతరం వాటిని ఫోర్జరీ చేసి అవసరమైనవారికి విక్రయంచాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై నిఘాపెట్టారు. సక్సోనీ రాష్ట్రంలోని ఎలెన్‌బర్గ్ కరోనా సెంటర్లో వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇన్నిసార్లు వ్యాక్సిన్ తీసుకున్నా అతడి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపలేదా? అనేదానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రావడం లేదు.
గతంలోనూ..
కాగా గత డిసెంబరులో, న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇలాగే 10 సార్లు కొవిట్ టీకాలు తీసుకున్నాడు. అదేంటంటే.. టీకాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని కారణం చెప్పాడు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో బిహార్‌కు చెందిన 84 ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్ అనే వ్యక్తి 11 సార్లు కరోనా టీకాలు తీసుకుని వార్తల్లో నిలిచారు.
Also Read: Darja : దర్శకేంద్రుడి చేతులమీదుగా ‘దర్జా’ పాట.. ఆకట్టుకుంటున్న ఉత్తేజ్ గాత్రం