ఓరుగల్లువాసులకు ఊరట: కోవిడ్‌ టెస్టులు, చికిత్సపై మంత్రి ఎర్రబెల్లి ప్రకటన!

|

Jul 16, 2020 | 9:16 PM

ఇక నుంచి వరంగల్‌ చుట్టుపక్కల జిల్లాల కరోనా రోగులందరికీ వరంగల్‌లోనే చికిత్సలు అందిస్తామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చెప్పారు. కరోనా నియంత్రణకు కావాల్సిన

ఓరుగల్లువాసులకు ఊరట: కోవిడ్‌ టెస్టులు, చికిత్సపై మంత్రి ఎర్రబెల్లి ప్రకటన!
Follow us on

ఇక నుంచి వరంగల్‌ చుట్టుపక్కల జిల్లాల కరోనా రోగులందరికీ వరంగల్‌లోనే చికిత్సలు అందిస్తామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చెప్పారు. కరోనా నియంత్రణకు కావాల్సిన సకల ఏర్పాట్లు వరంగల్‌లోనే చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలు ఆందోళన పడొద్దని, కరోనా వచ్చిందనో, వస్తుందనో అక్కడా ఇక్కడా తిరగవద్దని హెచ్చరించారు. ప్రజా సేవకు ఇది మంచి తరుణమని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎంజిఎం వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఎర్రబెల్లి చర్చించారు.

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బాధితులను గుర్తించి సరైన సమయంలో వైద్యం అందించేందుకు గానూ ప్రభుత్వం పటిష్ట చర్యలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను ముమ్మరం చేసింది. మరోవైపు జిల్లాల్లో విస్తరిస్తున్న వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు స్థానికంగానే టెస్టులు, చికిత్స అందించేందుకు వీలుగా సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది.