Corona Virus Effect: దేశంలో తగ్గుతున్న కరోనా ప్రభావం.. గణనీయంగా పడిపోయిన మరణాల సంఖ్య..

|

Jan 04, 2021 | 2:42 PM

Corona Virus Effect: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు తగ్గుతోంది. కరోనా కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య నానాటికి...

Corona Virus Effect: దేశంలో తగ్గుతున్న కరోనా ప్రభావం.. గణనీయంగా పడిపోయిన మరణాల సంఖ్య..
Follow us on

Corona Virus Effect: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు తగ్గుతోంది. కరోనా కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య నానాటికి తగ్గుతోంది. ఇది శుభపరిణామం అనే చెప్పాలి. గత వారం రోజుల్లో కరోనా కారణంగా 1,748 మంది మృత్యువాత పడ్డారు. ఇంత తక్కువ సంఖ్య గత 30 వారాల క్రితం నమోదవగా, మళ్లీ అంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. ఇక డిసెంబర్ 28 నుండి జనవరి 3 వరకు అంటే వారం రోజుల వ్యవధిలో 1,748 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇది గత వారంతో పోలిస్తే 16శాతం తక్కువ. గత వారం 2,087 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇక చివరగా జూన్ 1 నుంచి 7వ తేదీ మధ్య ఏడు రోజుల్లో 1,797 మరణాలు నమోదు అయ్యాయి.

దాదాపు ఏడు నెలల క్రితం అంటే గత మే నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు నమోదైన మరణాలను పరిశీలిస్తే.. ఈ వారమే అత్యంత తక్కువ మరణాలు నమోదు అయ్యాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్న సెప్టెంబర్ నెలలో అయితే భారీ స్థాయిలో మరణాలు రికార్డ్ అయ్యాయి. కేవలం సెప్టెంబర్ 14-20 మధ్యలోనే 8,175 మంది కరోనా కారణంగా బలి అయ్యాయి. ప్రస్తుతం పోలిస్తే అది పీక్స్ అని చెప్పాలి. మొత్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. దాంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇదే సమయంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి చూసుకుంటే తాజాగా నమోదైన కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ అని చెప్పాలి. ఇలా మొత్తంగా తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇది ఐదవసారి. గత వారంతో పోల్చితే ఈ వారం 1,32,765(13శాతం) కేసులు తక్కువగా నమోదయ్యాయి. జూన్ 21-28 మధ్య నమోదైన 1.2 లక్షల కరోనా సంఖ్యతో పొలిస్తే.. నాటి నుంచి నేటి వరకు కరోనా కేసుల సంఖ్య తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవ వారం.

ఇక గత సెప్టెంబర్ నెల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో 16, 733 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే 1,400 కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 217 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా 2.5 లక్షల దిగువకు పడిపోయింది. ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక కరోనా కేసులు కేరళలోనే నమోదు అయ్యాయి. 4,600 కొత్త కరోనా కేసులతో కేరళ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. మరణాలు కూడా అంతే స్థాయిలో రికార్డ్ అయ్యాయి.

 

Also read:

ముస్లిం ఓట్లపై దృష్టి, బెంగాల్ లో కాలు మోపిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మమత పై ఫైర్

TDP Politburo Meeting : ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. గైర్హాజరైన నేతలు ఎవరంటే..?