TDP Politburo Meeting : ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. గైర్హాజరైన నేతలు ఎవరంటే..?
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. కేంద్ర పార్టీ కార్యాలయంలో వరుస భేటీలు నిర్వహిస్తుంది అధిష్ఠానం. తిరుపతి ఉప ఎన్నిక, సంస్థాగత నిర్మాణం,

TDP Politburo Meeting : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. కేంద్ర పార్టీ కార్యాలయంలో వరుస భేటీలు నిర్వహిస్తుంది అధిష్ఠానం. తిరుపతి ఉప ఎన్నిక, సంస్థాగత నిర్మాణం, అమరావతి భవిషత్ కార్యాచరణ, రైతుల బస్సు యాత్రకు జాతీయ పార్టీల మద్దతు అంశాలపైనా చర్చింనుంది పొలిట్ బ్యూరో. రైతాంగ సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా నేతలు చర్చించనున్నారు. దేవాలయాలపై వరుస దాడులు తదితర అంశాలపై నేతలు అభిప్రాయాలను పంచుకోనున్నారు. వివిధ కారణాల వల్ల పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, నందమూరి బాలకృష్ణ, లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, బొండా ఉమ గైర్హాజరయ్యారు. మొత్తం 13 అంశాలపై ఈసమావేశంలో చర్చించనున్నారు. రేపు టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తారు. టీడీపీ నూతన కమిటీల ఏర్పాటు తర్వాత ఫస్ట్ టైమ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Also Read :