కరోనా అప్‌డేట్స్‌: 58లక్షలు దాటేసిన కేసులు.. తొమ్మిదో స్థానంలో భారత్..!

| Edited By:

May 29, 2020 | 11:14 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ కొనసాగుతోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58లక్షలను దాటేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58,03,416 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

కరోనా అప్‌డేట్స్‌: 58లక్షలు దాటేసిన కేసులు.. తొమ్మిదో స్థానంలో భారత్..!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ కొనసాగుతోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58లక్షలను దాటేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58,03,416 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 3,59,791 మంది ఈ వైరస్‌ బారిన పడి చనిపోగా.. 23,99,247 కోలుకున్నారు. ఇక అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,58,422 దాటేసింది. 1,02,917 మంది ఆ దేశంలో మృత్యువాతపడగా.. 3,78,566 కోలుకున్నారు. ఇక కరోనా విస్తరణ అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తరువాత బ్రెజిల్, రష్యా, ఇంగ్లండ్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, టర్కీ, ఇరాన్‌లు టాప్‌ 10లో ఉన్నాయి. 1,65,799కేసులతో భారత్ తొమ్మిదో స్థానంలోకి చేరింది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల తరువాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో విధించిన నాలుగోదశ లాక్‌డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగిస్తారా..? లేదా..? అన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read This Story Also: ప్రపంచ వయో వృద్ధుడు ‘బాబ్’ కన్నుమూత..!