Coronavirus vaccination: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్.. గత 24గంటల్లో ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారంటే..?

|

Mar 05, 2021 | 9:24 PM

India Coronavirus vaccination updates: దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో..

Coronavirus vaccination: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్.. గత 24గంటల్లో ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారంటే..?
Follow us on

Coronavirus vaccination updates: ఒకవైపు భారత్‌లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి… మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో దేశ వ్యాప్తంగా సుమారు 13,88,170 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 16న మొదటి దశ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమైన నాటినుంచి ఒక్క రోజులో ఇంత మందికి కరోనా వ్యాక్సిన్ అందించడం ఇదే తొలిసారని ని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,80,05,503 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 68,53,083 మంది ఆరోగ్యకార్యకర్తలు, సిబ్బంది, 60,90,931 ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఫస్ట్‌ డోస్‌ ఇచ్చారు. రెండో దశలో 31,41,371 మంది ఆరోగ్య కార్యకర్తలకు, 67,297 మంది ఫ్రంట్లైన్ సిబ్బందికి రెండో డోస్‌ అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలాఉంటే.. 45 ఏళ్లు దాటి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారిలో 2,35,901 మందికి, 60 ఏళ్లు దాటిన 16,16,920 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు నాటికి 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, 45ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు.

 

Also Read: