
తెలంగాణలో జనవరి 15నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తంగా 2.7 లక్షల వైద్య సిబ్బందికి, డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్, టెక్నీషియన్స్‌కు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జనవరి రెండో వారంలో ప్రారంభమవుతుందని తెలిపారు. టీకా పంపిణీ పూర్తిగా ఎలక్షన్ పద్దతిలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ కోసం ముందుగా స్థానికంగా ఏర్పాటు చేసిన టీకా సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలిపారు. అందుకు అభ్యర్థులు వాళ్ళ ఐడీ కార్డు లేదా ఆధార్ కార్డుతో రావాల్సిన ఉంటుందని.. అభ్యర్థుల ఐడీ కార్డులను పరీశీలించబడుతుందని తెలిపారు. అనంతరం అభ్యర్థులకు ఒక ఎస్ఎంఎస్ వస్తుందని అనంతరం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
దాదాపు వ్యాక్సినేషన్ సెంటర్లలో అన్ని రకాల ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఈ టీకా పంపిణీకి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం తెలిసింది. ఇందుకుగానూ కొన్ని ప్రైవేట్ సెంటర్లను కూడా ఎంచుకుంది. ఇందుకోసం రాష్ట స్థాయి, జిల్లా స్థాయి, ప్రాథమిక స్థాయిలలో డిసెంబర్ 22 వరకు శిక్షణ ఏర్పాట్లును పూర్తిచేయనుంది.