Covid 19 Vaccine: గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ

|

Aug 20, 2021 | 8:00 PM

కరోనా మహమ్మారిని జయించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అన్న నిపుణుల సూచనల మేరకు.. దేశంలోని అర్హులందరికీ సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Covid 19 Vaccine: గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ
Zydus Cadila
Follow us on

Covid 19 Vaccine Zydus Cadila: కరోనా మహమ్మారిని జయించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అన్న నిపుణుల సూచనల మేరకు.. దేశంలోని అర్హులందరికీ సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో పాటు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగానే తాజాగా స్వదేశంలో తయారైన మరో టీకా.. జైడస్ క్యాడిల్లా రూపొందించిన ‘జైకోవ్ డీ’ టీకాకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది.ఇండియాలో క‌రోనా వైర‌స్ కోసం అత్యవసర అనుమ‌తి పొందిన ఐదో వ్యాక్సిన్ జైడస్ క్యాడిల్లా కావడం విశేషం..

ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వి, మోడెర్నాల‌కు డీసీజీఐ అనుమ‌తి ఇవ్వగా.. తాజాగా జైడస్ క్యాడిల్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అనుమతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఎన్ఏ ప్లాట్‌ఫాం మీద రూపొందించిన వ్యాక్సిన్ ‘జైకోవ్ డీ’ దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు డీసీజీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 12 ఏళ్లు దాటిన చిన్నారులు సహా పెద్దలందరికీ ఉపయోగించేందుకు ఈ వ్యాక్సిన్ వీలుంటుందని తెలిపింది. జైడస్ కాడిలా ఈరోజు ZyCoV D కొరకు DCGI నుండి అత్యవసర వినియోగ ప్రామాణీకరణకు ఆమోదం పొందిందని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే మొట్టమొదటి, భారతదేశ స్వదేశీ అభివృద్ధి చెందిన DNA ఆధారిత కోవిడ్ టీకా ఇదని తెలిపింది.


Read Also… Post Office Insurance: పోస్టాఫీస్‌లో నెలకు 2200 రూపాయలు కట్టండి..29 లక్షల రూపాయలు సంపాదించండి..ఎలానో తెలుసుకోండి!