బూస్టర్‌ డోస్‌ గురించి శుభవార్త.. ఒమిక్రాన్‌పై 88% ప్రభావం.. UK అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

|

Jan 02, 2022 | 5:54 PM

Booster Dose: బూస్టర్‌ డోస్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా 88 శాతం రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు UK అధ్యయనంలో బయటపడింది.

బూస్టర్‌ డోస్‌ గురించి శుభవార్త.. ఒమిక్రాన్‌పై 88% ప్రభావం.. UK అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..
Vaccine
Follow us on

Booster Dose: బూస్టర్‌ డోస్ ఒమిక్రాన్‌కి వ్యతిరేకంగా 88 శాతం రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు UK అధ్యయనంలో బయటపడింది. టీకా సెకండ్‌ డోస్ కంటే బూస్టర్ డోస్ కొత్త వేరియంట్‌కి వ్యతిరేకంగా అధిక స్థాయి రక్షణను అందిస్తుంది. బూస్టర్‌ డోస్‌ ప్రభావం ఆరు నెలల వ్యవధి తర్వాత క్షీణించడం ప్రారంభమవుతుంది. ఒమిక్రాన్ మొదటి కేసు UKలోనే కనుగొన్నారు అందుకే బూస్టర్ డోస్‌ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఇటీవల బూస్టర్ డోస్ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐసియులో చేరిన వారిలో 90 శాతం మందికి పైగా బూస్టర్ డోస్ తీసుకోని వారు ఉన్నారు.

బూస్టర్ డోస్ చాలా వరకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఆసుపత్రిలో చేరడానికి దారితీసే ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. డాక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. ‘ఓమిక్రాన్ వేరియంట్‌ సోకిన రోగి ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని బూస్టర్‌ డోస్‌ తగ్గిస్తుందన్నారు. ఇది గొప్ప రక్షణ కల్పిస్తుందన్నారు. బూస్టర్‌ డోస్ తీసుకున్న తర్వాత టీకా ప్రభావం 52 శాతం నుంచి 88 శాతానికి పెరుగుతుందన్నారు. బూస్టర్‌ డోస్‌ తీసుకున్న10 వారాల తర్వాత దీని ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ డెల్టాతో పోలిస్తే ఓమిక్రాన్-సోకిన రోగులు ఆసుపత్రిలో చేరే అవకాశం తక్కువగా ఉంటుందని నివేదిక ద్వారా తెలుస్తోంది. బూస్టర్‌ డోస్‌ తర్వాత ఓమిక్రాన్ కేసులలో ఆసుపత్రిలో చేరే ప్రమాదం తగ్గుతుంది. మూడు డోస్‌లు తీసుకున్న ఓమిక్రాన్ రోగులు వ్యాక్సిన్‌ ఒక్క డోస్ కూడా తీసుకోని వారితో పోలిస్తే ఆసుపత్రిలో చేరే ప్రమాదం 81 శాతం తగ్గుదల కనిపించింది.

CISF నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు, జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే..?

Air Travel: విమాన ప్రయాణం ఖరీదు.. జెట్‌ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి.. లీటర్‌కి ఎంత పెరిగిందంటే..?

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..