Covid 19: మాస్క్‌లు వేసుకున్నా వైరస్ వస్తుందట.. ఎలాగంటే..!

| Edited By: Ravi Kiran

Feb 29, 2020 | 9:15 AM

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి.. ఇప్పుడు 49 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 2,859మంది తనువు చాలించారు

Covid 19: మాస్క్‌లు వేసుకున్నా వైరస్ వస్తుందట.. ఎలాగంటే..!
Follow us on

Covid 19: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి.. ఇప్పుడు 49 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 2,859మంది తనువు చాలించారు. చైనాతో పాటు దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలో ఈ వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. అయితే ఏ వైరస్ వచ్చినా దాని బారిన పడకుండా ఉండేందుకు చాలామంది మాస్క్‌లు ధరిస్తూ ఉంటారు. కానీ మాస్క్‌లు వేసుకన్నా వైరస్ వస్తుందట. అవును మీరు చదువుతున్నది నిజమే.

మనకు కరెక్ట్‌గా సరిపోని మాస్క్‌ను ధరిస్తే దాని ద్వారా వైరస్ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు అమెరికాలోని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజర్. చేతులను సరిగా శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకినా వైరస్ త్వరగా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. అయితే ఒకవేళ వైరస్ లక్షణాలు ఉన్న వారు మాస్క్‌ను ధరించడం వలన అది వేరే వారికి వ్యాపించకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. మాస్క్‌ల ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గింది అని నిరూపించడానికి ఇంతవరకు సరైన నిర్ధారణలు కూడా లేవని మరో వైద్యుడు ఆండ్య్రూ స్టాన్‌లీ పెకోజ్ చెప్పుకొచ్చారు. అలాగే సాధారణంగా సర్జరీ చేసే సమయంలో డాక్టర్లు ఉపయోగించే మాస్క్‌లను వైరస్ రాకుండా ధరించినా.. పెద్ద ఉపయోగం ఉండదని పెకోజ్ అంటున్నారు. వైరస్‌లు విస్తరించకుండా ఉండేందుకు N95 లాంటి స్పెషల్ మాస్క్‌లను వాడటం ఉత్తమమని ఆయన చెబుతున్నారు. అలాగని అవి ధరించినప్పటికీ.. గాలిని స్వచ్ఛంగా ఫిల్టర్ చేయలేవని దాని వలన దగ్గు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక N99 మాస్క్ 99శాతం గాలిలోని వైరస్ శరీరంలోకి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుందని.. అలాగని వాటిని ఎక్కువ సేపు ధరించలేమని స్పష్టం చేశారు. మొత్తానికి మాస్క్‌లు ధరిస్తే వైరస్ వ్యాప్తి చెందదన్నది అపోహేనని డాక్టర్లు అంటున్నారు.

For More:

మందు బాటిళ్లు, నాగిని డ్యాన్సులతో పోలీసులు హల్‌చల్.. వీడియో వైరల్..!