Kerala Corona : కేరళలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య.. గడిచిన 24 గంటల్లో 5,266 కరోనా కేసులు..

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంటే.. కేరళలో మాత్రం రోజు రోజు కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,266 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య..

Kerala Corona : కేరళలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య.. గడిచిన 24 గంటల్లో 5,266 కరోనా కేసులు..

Updated on: Feb 03, 2021 | 5:34 PM

Kerala Corona : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంటే.. కేరళలో మాత్రం రోజు రోజు కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,266 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,206కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 22 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,071కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 4746కు చేరింది. అయితే రికవరీ రేటు కూడా రోజు రోజుకు తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో వైద్య అధికారుల్లో ఆందోళన నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు అంకెల సంఖ్య నుంచి దిగి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలను కొన్ని ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ చేస్తుండటంతో పాటు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..