Covid 19 in Hyderabad: కరోనా ఎఫెక్ట్: నగరంలోని ఆ ప్రదేశంలో స్కూళ్లు బంద్..!

| Edited By:

Mar 04, 2020 | 2:28 PM

చైనాలో పుట్టిన కోవిడ్-19 ఇప్పుడు అందరిలో అలజడిని పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి.. 3,198మంది ప్రాణాలను తీసుకుంది. ఇక భారత్‌లోనూ చేప కింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది.

Covid 19 in Hyderabad: కరోనా ఎఫెక్ట్: నగరంలోని ఆ ప్రదేశంలో స్కూళ్లు బంద్..!
Follow us on

చైనాలో పుట్టిన కోవిడ్-19 ఇప్పుడు అందరిలో అలజడిని పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి.. 3,198మంది ప్రాణాలను తీసుకుంది. ఇక భారత్‌లోనూ చేప కింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మరో 80మందికి పైగా అనుమానితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో నగరంలోని మహేంద్రహిల్స్‌లో స్కూళ్లు బంద్ చేశారు. తొలి పాజిటివ్ కేసు అక్కడే గుర్తింపు కావడంతో.. బాధితుడి ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలో హెల్త్ అలర్ట్‌ను విధించారు. మహేంద్ర హిల్స్‌లో వైరస్ విస్తరించకుండా కంటోన్మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. అక్కడి పరిసరాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వైరస్ నివారణ రసాయనాలు కూడా చల్లినట్లు మంత్రి ఈటెల చెప్పుకొచ్చారు.

అప్రమత్తంగా ఉన్నాం: సీపీ సజ్జనార్
మరోవైపు నగరంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ వైరస్‌పై అప్రమత్తమయ్యామని.. విధుల కోసం హాస్పిటల్స్ దగ్గర, బయట పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలిసిందిగా తెలిపినట్లు పేర్కొన్నారు. కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని.. ఈరోజు నుంచి ట్రాఫిక్ అనౌన్స్‌మెంట్ తో పాటు కోవిడ్-19పై కూడా అనౌన్స్‌మెంట్ ఇస్తున్నామని అన్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో నివసిస్తున్న చాలామంది నగరాన్ని వదిలి వెళ్తున్నట్లు తెలుస్తోంది.