మహారాష్ట్రలో విజృంభిస్తొన్న కరోనా మహమ్మారి.. ఒక్కరోజే..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు పన్నెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు వందల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. కరోనా బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో 286 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఒక్కరోజే.. కరోనాతో రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. […]

మహారాష్ట్రలో విజృంభిస్తొన్న కరోనా మహమ్మారి.. ఒక్కరోజే..
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2020 | 10:59 PM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు పన్నెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నాలుగు వందల ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. కరోనా బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో 286 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఒక్కరోజే.. కరోనాతో రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో పూణెలో నలుగురు.. ముంబైలో ముగ్గురు మృతిచెందినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 194కు చేరింది. ఇక గురువారం నమోదైన తాజా కేసులతో కలిపి.. ఇప్పటివరకూ మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3202కు చేరింది. ఇక వీరిలో గురువారం కరోనా నుంచి కోలుకొని.. ఐదుగురు బయటపడ్డారని.. వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 300 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.