జ‌వాన్ల‌ను వెంటాడుతున్న క‌రోనా..అక్క‌డ 11 మందికి పాజిటివ్‌

|

Apr 04, 2020 | 9:29 AM

మ‌హారాష్ట్రాలో మ‌హ‌మ్మారి క‌రోనా కోర‌లు చాస్తోంది. ముంబైలో మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌ప‌డింది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తోన్న క‌రోనా భూతం ఇప్పుడు జ‌వాన్ల‌ను కూడా వెంటాడుతోంది. ముంబై విమానాశ్ర‌యంలో విధులు నిర్వ‌ర్తించిన 11 మంది సీఐఎస్ ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. విదేశీ ప్ర‌యాణికుల ద్వారానే ఈ జ‌వాన్ల‌కు వైర‌స్ సోకి ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల […]

జ‌వాన్ల‌ను వెంటాడుతున్న క‌రోనా..అక్క‌డ 11 మందికి పాజిటివ్‌
Lathepora: Security forces cordon off the site of suicide bomb attack at Lathepora Awantipora in Pulwama district of south Kashmir, Thursday, February 14, 2019. At least 30 CRPF jawans were killed and dozens other injured when a CRPF convoy was attacked. (PTI Photo) (PTI2_14_2019_000159B)
Follow us on
మ‌హారాష్ట్రాలో మ‌హ‌మ్మారి క‌రోనా కోర‌లు చాస్తోంది. ముంబైలో మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌ప‌డింది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తోన్న క‌రోనా భూతం ఇప్పుడు జ‌వాన్ల‌ను కూడా వెంటాడుతోంది. ముంబై విమానాశ్ర‌యంలో విధులు నిర్వ‌ర్తించిన 11 మంది సీఐఎస్ ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు.

విదేశీ ప్ర‌యాణికుల ద్వారానే ఈ జ‌వాన్ల‌కు వైర‌స్ సోకి ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు. విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి భారీగా రాకపోకలు సాగించారు. దీంతో ముందు జాగ్రత్తగా 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను గత కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంచారు. వీరిలో ముందుగా నలుగురికి పాజిటివ్ రాగా.. మిగతా ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ఎఫ్ ప్రకటించింది. మ‌రో జ‌వాన్ రిపోర్ట్ రావాల్సి ఉంద‌ని చెప్పారు.

ముందుగా ఓ జవాన్‌కు క‌రోనా పాజిటివ్ అని రిపోర్ట్ రాగా.. మరోసారి నిర్వహించిన పరీక్ష‌ల్లో నెగటివ్ అని వచ్చింది. దీంతో మూడోసారి అతడి శాంపిళ్లను టెస్టులకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని.. అతడ్ని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచినట్లు సీఐఎస్ఎఫ్ తెలిపింది. అయితే,  వీరికి ప్రయాణికుల నుంచి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఐడీ కార్డులను తాకడం, వాష్ రూమ్‌లలో నీళ్ల ట్యాప్‌లను ముట్టుకోవడం వల్ల వీరికి కోవిడ్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.