
ప్రపంచదేశాలలో కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే అన్ని దేశాలూ వివిధ దశల్లో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,031,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 403,138 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 3,436,870 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(1,995,854), మరణాలు(112,187) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 677,553 నమోదు కాగా, మృతుల సంఖ్య 36,062కు చేరింది. ఇక రష్యాలో 467,673 పాజిటివ్ కేసులు, 5,859 మరణాలు నమోదయ్యాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 254,340 నమోదు కాగా, మృతుల సంఖ్య 7,117కి చేరింది.