న్యాయవ్యవస్థలో ఉన్నవారికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ పిల్ దాఖలు.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు..

|

Feb 16, 2021 | 10:50 PM

Coronavirus Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 లక్షల..

న్యాయవ్యవస్థలో ఉన్నవారికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ పిల్ దాఖలు.. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు..
Follow us on

Coronavirus Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే కొవిడ్‌-19 టీకా పంపిణీలో న్యాయమూర్తులతో సహా న్యాయవ్యవస్థలో భాగమైన వారందరికీ ప్రాధాన్యం ఇవ్వాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారి చేసింది. దీనిపై కేంద్రం స్పందన తెలియజేయాలంటూ సూచించింది. అరవింద్‌ సింగ్‌ అనే వ్యక్తి న్యాయ వ్యవస్థలో ఉన్న వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ప్రాధాన్యం కల్పించాలని సుప్రీం కోర్టులో పిల్ ను దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారించింది.

ప్రభుత్వం.. పోలీసు సిబ్బంది, వైద్యారోగ్య, భద్రతా, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రాధాన్యత కల్పించిందని.. అయితే ఆయా శాఖలన్నీ చివరకు న్యాయవ్యవస్థ వద్దకే వస్తాయని.. ఆయన పిటిషన్‌లో అరవింద్ సింగ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో అంతర్భాగమైన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ప్రాధాన్యత కల్పించాలంటూ అరవింద్ సింగ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించి.. కేంద్రానికి నోటీసు జారీ చేసింది. రెండువారాల అనంతరం దీనిపై వాదనలు వింటామంటూ త్రిసభ్య ధర్మాసనం వాయిదా వేసింది.

Also Read:

“Toolkit” ఇప్పుడీ పదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఓ మహోద్యమాన్ని పక్కదారి పట్టించింది. అసలేంటిది.?

Smriti Irani: దేశీ భావాలనే గౌరవించండి.. షెహనాజ్ గిల్ వైరల్ వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..