కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

|

May 16, 2020 | 10:53 AM

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కకలావికలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,628,561 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 308,645 మంది ప్రాణాలు విడిచారు. అటు 1,758,080 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో రికవరీ రేటు రోజురోజుకూ […]

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..
World Coronavirus
Follow us on

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కకలావికలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి లక్షల్లో ప్రజలు మృత్యువాతపడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,628,561 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 308,645 మంది ప్రాణాలు విడిచారు. అటు 1,758,080 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో రికవరీ రేటు రోజురోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పవచ్చు.

కాగా, అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు(1,484,285), మరణాలు(88,507) అత్యధికంగా సంభవించాయి. ఇక స్పెయిన్(274,367), రష్యా(262,843), బ్రిటన్(236,711), ఇటలీ(223,885) దేశాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, ఇరాన్ దేశాల్లో కూడా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. భారతదేశం విషయానికి వస్తే ఇప్పటివరకు 85,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,753 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..