కరోనా అప్డేట్: 24 గంటల్లో 50 మరణాలు.. 1,383 పాజిటివ్ కేసులు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా కేసులు 20వేల మార్క్‌కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 19,984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 640 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 15,474 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3870 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి […]

కరోనా అప్డేట్: 24 గంటల్లో 50 మరణాలు.. 1,383 పాజిటివ్ కేసులు..

Updated on: Apr 22, 2020 | 8:54 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా కేసులు 20వేల మార్క్‌కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 19,984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 640 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 15,474 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3870 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరక 251 మంది కరోనాతో మరణించారు. ఇక ఢిల్లీలో 2156 కేసులు నమోదవ్వగా..47 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 2178 కేసులు నమోదవ్వగా.. 90 మంది ప్రాణాలు కోల్పోయారు.రాజస్థాన్‌లో 1659 కేసులు, మృతులు 25 మంది, మధ్యప్రదేశ్‌లో 1552 కేసులు నమోదవ్వగా..76 మంది చనిపోయారు. ఇక యూపీలో 1294 కేసులు నమోదవ్వగా… ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read:

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..