క‌రోనా ఎఫెక్ట్‌…నో షేవింగ్‌..నో క‌ట్టింగ్ కాద‌ని వెళితే త‌ప్ప‌దు భారీ మూల్యం.!

|

Apr 20, 2020 | 12:53 PM

కరోనా ప్రభావంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెలూన్ షాపులన్నీ మూతపడ్డాయి. దీనితో కొందరు కటింగ్ పెరిగిపోతోందని.. దయ చేసి షాపులు తెరవాలంటూ మంత్రులకు విన్నవించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మంత్రి కేటిఆర్‌తో ఈ విషయం గురించి ట్విట్టర్‌లో చర్చించిన సంగతి తెలిసిందే. అది కాస్తా వైరల్ కూడా అయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. కరోనా విజృంభిస్తున్న వేళ.. కట్టింగ్ షాపులు తెరిస్తే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా దిగజారే […]

క‌రోనా ఎఫెక్ట్‌...నో షేవింగ్‌..నో క‌ట్టింగ్ కాద‌ని వెళితే త‌ప్ప‌దు భారీ మూల్యం.!
Follow us on

కరోనా ప్రభావంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెలూన్ షాపులన్నీ మూతపడ్డాయి. దీనితో కొందరు కటింగ్ పెరిగిపోతోందని.. దయ చేసి షాపులు తెరవాలంటూ మంత్రులకు విన్నవించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మంత్రి కేటిఆర్‌తో ఈ విషయం గురించి ట్విట్టర్‌లో చర్చించిన సంగతి తెలిసిందే. అది కాస్తా వైరల్ కూడా అయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. కరోనా విజృంభిస్తున్న వేళ.. కట్టింగ్ షాపులు తెరిస్తే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా దిగజారే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాను చూస్తేనే అర్ధమవుతుంది.

అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ 50 శాతం పైగా కేసులు బార్బర్ షాపుల వల్లే వచ్చాయని తెలుస్తోంది. బార్బర్ షాపులో టవల్, రేజర్, బ్రష్, కుర్చీ.. ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని అందరూ ఉపయోగిస్తారు. వారిలో ఒక్కరికి కరోనా ఉన్నా.. అది అందరికీ సోకుతుందట. కాగా, ఒకవేళ పరిస్థితి మళ్ళీ మాములు స్థితికి చేరినా కట్టింగ్ షాపుల వైపుకు కొద్దిరోజులు వెళ్లకుండా ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే కట్టింగ్ ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి.

Also Read:

హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి నిర్వాకం..

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…