కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

|

Apr 09, 2020 | 2:10 PM

Coronavirus Updates: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 1,940 మంది మృతి చెందటం అగ్రరాజ్యంలో ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో అక్కడ కరోనా మృతుల సంఖ్య 14,797 చేరింది. గడచిన 24 గంటల్లో 31,935 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 435,160 కేసులు […]

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..
Follow us on

Coronavirus Updates: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 1,940 మంది మృతి చెందటం అగ్రరాజ్యంలో ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో అక్కడ కరోనా మృతుల సంఖ్య 14,797 చేరింది.

గడచిన 24 గంటల్లో 31,935 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 435,160 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికాలోనే అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. అంతేకాకుండా దేశంలో కరోనా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, కరోనా కారణంగా దాదాపు 2,40,000 మంది మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా 1,519,442 మందికి కరోనా వైరస్‌ సోకగా, 88,543 మంది మృతి చెందారు. అటు 330,890 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…