కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..

|

Mar 30, 2020 | 8:20 AM

Coronavirus Update: చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. ముఖ్యంగా యూరోప్, అమెరికా దేశాల్లో కరోనా పంజా విసురుతోంది. ఆ దేశాలు ఈ వైరస్ దాటికి అతలాకుతలం అవుతున్నాయి. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ కోవిడ్ 19 మిగతా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే 185 దేశాలకు ఈ వైరస్ పాకగా.. ముఖ్యంగా 15 దేశాల్లో మాత్రం దీని తీవ్రత తారాస్థాయిలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7,21,903 […]

కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..
Follow us on

Coronavirus Update: చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. ముఖ్యంగా యూరోప్, అమెరికా దేశాల్లో కరోనా పంజా విసురుతోంది. ఆ దేశాలు ఈ వైరస్ దాటికి అతలాకుతలం అవుతున్నాయి. చైనాలో తగ్గుముఖం పట్టిన ఈ కోవిడ్ 19 మిగతా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇప్పటికే 185 దేశాలకు ఈ వైరస్ పాకగా.. ముఖ్యంగా 15 దేశాల్లో మాత్రం దీని తీవ్రత తారాస్థాయిలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7,21,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అగ్రరాజ్యం అమెరికాలోనే 1,42,004 నమోదు కావడంతో.. అక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మృతుల సంఖ్య కూడా 2,484కు చేరింది.

ఇదిలా ఉంటే కరోనా దాటికి ఇటలీ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ముందే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నియంత్రణ చర్యలు పటిష్టంగా లేకపోవడంతో ఇటలీలో కరోనా తీవ్రంగా వ్యాపించింది. ఆ దేశంలో ఇప్పటివరకు 97,689 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఏకంగా 10,779 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

మరోవైపు చైనాలో ఈ వైరస్ కారణంగా ఎంతోమంది బలయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు కాగా.. 3,300 మంది మృతి చెందారు. వీటితో పాటు స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, యూకేలలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.

స్పెయిన్‌లో 80,110 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 6,803కు చేరింది. అటు జర్మనీలో కేసులు అధికంగా నమోదైనా.. మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫ్రాన్స్ – ఇరాన్ – యూకేలు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఇది చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

[table id=73 /]