తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్ని నమోదయ్యాయంటే..!

| Edited By:

May 14, 2020 | 9:57 PM

తెలంగాణలో కరోనా విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. అందులో 40 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,414కు చేరింది. 24 గంటల్లో 13 మంది కోలుకోగా.. ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 34కు చేరింది. మరోవైపు ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా ఉన్నాయి. […]

తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్ని నమోదయ్యాయంటే..!
Follow us on

తెలంగాణలో కరోనా విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. అందులో 40 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,414కు చేరింది. 24 గంటల్లో 13 మంది కోలుకోగా.. ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 34కు చేరింది.

మరోవైపు ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా ఉన్నాయి. ఈ ఉదయం 9 గంటల వరకు ఏపీలో 36 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100 కు చేరింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్యను ఏపీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ కేసులు 105 ఉన్నట్లు ఆ రాష్ట్రం అధికారికంగా ప్రకటించింది.

 

Read This Story Also: లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. అక్కడ ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..!