ఘనంగా పెళ్లిరోజు, కొడుకు పుట్టిన రోజు వేడుకలు..ఫలితంగా 17 మందికి కరోనా

|

Jun 22, 2020 | 1:47 PM

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు జనాలు ఎక్కువగా గుమిగూడరాదని, సామాజిక దూరం పాటించాలని అధికారులు, పోలీసులు ఎంతగానో చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కరోనా పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. అధికారుల సూచనలు పెడచెవిన పెడుతున్నారు. అలాగే, ఓ మహిళ చేసిన నిర్వాకానికి ఏకంగా 17 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పాజిటివ్ మహిళ ఒకరు కొడుకు పుట్టిన రోజు, వారి పెళ్లిరోజును వేడుకలను ఘనంగా నిర్వహించింది.

ఘనంగా పెళ్లిరోజు, కొడుకు పుట్టిన రోజు వేడుకలు..ఫలితంగా 17 మందికి కరోనా
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు జనాలు ఎక్కువగా గుమిగూడరాదని, సామాజిక దూరం పాటించాలని అధికారులు, పోలీసులు ఎంతగానో చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కరోనా పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. అధికారుల సూచనలు పెడచెవిన పెడుతున్నారు. అలాగే, ఓ మహిళ చేసిన నిర్వాకానికి ఏకంగా 17 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పాజిటివ్ మహిళ ఒకరు కొడుకు పుట్టిన రోజు, వారి పెళ్లిరోజును వేడుకలను ఘనంగా నిర్వహించింది. చుట్టుపక్కల జనాలు, బంధువులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించారు. ఈ ఘటన ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలో ఇప్పటివరకు 3 కోవిడ్‌ కేసులు ఉండగా.. తాజా కేసులతో మొత్తం సంఖ్య 20కి చేరిందని కలెక్టర్‌ సరోజ్‌ కుమార్‌ సమాల్‌ వెల్లడించారు. కలెక్టర్ తెలిపిన వివరాల మేరకు..

జూన్‌ 14న ఓ మహిళ గురుగ్రామ్‌ నుంచి తన భర్త, కుమారుడితో కలసి ఝార్సుగూడలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా పాజిటవ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు. అయితే, జూన్‌ 21న కుమారుడి పుట్టిన రోజు, వారి పెళ్లి రోజు కావడంతో ఆ దంపతులు శనివారం అర్ధరాత్రి వేడుక ఏర్పాటు చేశారు. పొరుగున ఉండే మూడు కుటుంబాలను ఆహ్వానించారు. వేడుకల్లో సదరు పాజిటివ్‌ మహిళ కూడా పాల్గొనడంతో.. విందుకు వచ్చిన ఆ మూడు కుటుంబాల్లోని 17 మందికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాజిటివ్‌ వ్యక్తి, ఆమె బంధువుల కుటుంబాలపై విపత్తు నిర్వహణ చట్టం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం కేసులు నమోదుచేసినట్లు కలెక్టర్ సరోజ్ కుమార్ వివరించారు. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.