కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్‌లపై రష్యా సైబర్ దాడి..?

| Edited By:

Jul 17, 2020 | 5:48 AM

యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో..

కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్‌లపై రష్యా సైబర్ దాడి..?
Follow us on

యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక దేశాలు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ప్రస్తుతం రష్యా, అమెరికా,యూకే, భారత్, చైనా వంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. ఇక రష్యా అయితే తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌ కూడా పూర్తిచేసుకున్నట్లు ప్రకటించింది. తొలి దశ పూర్తిచేసుకున్న మొదటి వ్యాక్సిన్ తమదేనంటూ రష్యా ప్రకటించింది. ఆ తర్వాత యూకే, అమెరికా కూడా తొలి దశ పూర్తయినట్లు ప్రకటించాయి. ఇక మన భారత్‌లో కూడా రెండు వ్యాక్సిన్లు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా టెన్షన్‌ కంటే ఎక్కువ హ్యాకర్స్ టెన్షన్ పట్టుకుంది. రష్యన్ హ్యాకర్స్‌ కరోనా కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ వివరాలను తెలుసుకునేందుకు ఫార్మా కంపెనీలపై సైబర్ ఎటాక్‌కు పాల్పడుతున్నట్లు బ్రిటన్ పేర్కొంది. రష్యన్‌కు చెందిన గూడచారులు ఈ ప్రయత్నాలకు పాల్పడినట్లు ఆరోపించింది.

యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా, కెనడాల్లోని కరోనా వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్న ఫార్మా సంస్థలపై రష్యన్ హ్యాకర్స్ దాడి చేసినట్లు యూకేకు చెందిన నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూర్టీ సెంట‌ర్ పేర్కొన్న‌ది. అయితే ఏయే ఫార్మా కంపెనీల‌ను హ్యాకర్లు టార్గెట్ చేశార‌న్న విష‌యాన్నిమాత్రం ఆ సంస్థ వెల్ల‌డించ‌లేదు.మరోవైపు యూకే చేసిన ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. బ్రిట‌న్‌లోని ఫార్మా కంపెనీల‌ను హ్యాక‌ర్లు టార్గెట్ చేసిన‌ట్లు తమకు తెలియదని.. ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.