వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.72 లక్షలు..

|

Jul 30, 2020 | 10:09 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 290,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 7023 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17,308,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 672,483 మంది కరోనాతో […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.72 లక్షలు..
Follow us on

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 290,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 7023 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17,308,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 672,483 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 10,791,135 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,593,699), మరణాలు(154,400) సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటగా.. 90 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అటు రష్యాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 1,636,410 నమోదు కాగా, మృతుల సంఖ్య 35,779కి చేరింది.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!