దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 45,576 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 89,58,483కి చేరింది. చేరింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 4,43,303 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 83,83,602 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 485 మంది మృతి చెండంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,31,578 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 48,493 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 10,28,203 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 12.85 కోట్లకు చేరింది. దేశంలో సుమారు 93.58 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 4.95 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.47 శాతానికి తగ్గింది.
Also Read:
పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
#Adipurursh: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్..
?Total #COVID19 Cases in India (as on November 19, 2020)
▶️93.58% Cured/Discharged/Migrated (83,83,602)
▶️4.95% Active cases (4,43,303)
▶️1.47% Deaths (1,31,578)Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active cases+Deaths pic.twitter.com/ivssBTQ1Bd
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) November 19, 2020