వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.77 లక్షలు…

|

Jul 14, 2020 | 10:22 PM

Coronavirus Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 13,330,657 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 577,805మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 7,780,848 ఈ వైరస్ బారి నుంచి […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 5.77 లక్షలు…
Follow us on

Coronavirus Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 13,330,657 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 577,805మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 7,780,848 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 195,926 పాజిటివ్ కేసులు, 3719 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(3,501,245), మరణాలు(138,601) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 1,895,555 నమోదు కాగా, మృతుల సంఖ్య 73,161కు చేరింది. ఇక రష్యాలో 739,947 పాజిటివ్ కేసులు,11,439 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 934,565 నమోదు కాగా, మృతుల సంఖ్య 24,301కి చేరింది.