వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.90 లక్షలు..

|

Aug 02, 2020 | 9:42 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 255,699 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 5601 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు ప్రకారం […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 6.90 లక్షలు..
Follow us on

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 255,699 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 5601 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11,375,462 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18,097,682కి చేరుకుంది. అటు 690,047 మంది కరోనాతో చనిపోయారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,779,096), మరణాలు(158,043) సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,708,876కి చేరుకోగా.. 93 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అటు రష్యాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 1,780,268 నమోదు కాగా, మృతుల సంఖ్య 37,690కి చేరింది.