మూడు నెలలు అద్దె అడగకండి… యజమానులకు ఆదేశాలు..

|

Apr 18, 2020 | 8:11 PM

కరోనా వైరస్ కల్లోలంతో సామాన్య ప్రజలు సతమతమవుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కనీసం మూడు నెలల పాటు ఇంటి అద్దెను వసూలు చేయకూడదని యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ కూడా అద్దెకు ఉంటున్నవారిని ఇబ్బందులకు గురి చేసి.. ఇల్లు ఖాళీ చేయమని చెప్పకూడదని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అతిక్రమిస్తే.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న పేదవాళ్లు, వలస కూలీలను దృష్టిలో […]

మూడు నెలలు అద్దె అడగకండి... యజమానులకు ఆదేశాలు..
Follow us on

కరోనా వైరస్ కల్లోలంతో సామాన్య ప్రజలు సతమతమవుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కనీసం మూడు నెలల పాటు ఇంటి అద్దెను వసూలు చేయకూడదని యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ కూడా అద్దెకు ఉంటున్నవారిని ఇబ్బందులకు గురి చేసి.. ఇల్లు ఖాళీ చేయమని చెప్పకూడదని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అతిక్రమిస్తే.. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న పేదవాళ్లు, వలస కూలీలను దృష్టిలో పెట్టుకుని మహా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు రాజస్తాన్, మధ్య ప్రదేశ్‌లలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ 60 శాతం కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..